Original post on http://thatstelugu.oneindia.in/news/2010/08/14/pressure-on-ys-jagan-from-outside-140810.html
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నంత వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి, ఆగ్రహం ఇప్పుడు మంటలుగా ఎగిసిపడుతోంది. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై పార్టీ లోపలి నుంచి, వెలుపలి నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఎపిఐఐసికి సంబంధించిన ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం తీగ లాగితే డొంక కదులుతోంది. జగన్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపేలా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నానక్ రాం గుడాలోని వందల ఎకరాల భూమిని పెద్దలకు నామమాత్రం రేటుకు కట్టబెట్టి ఎపిఐఐసి దివాళా తీసిందనే వార్తల నేపథ్యంలో జగన్ కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొని ఉంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారానికి సూత్రధారులు దివంగత నేత వైయస్, ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచందర్ రావు సూత్రధారులని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన భూకేటాయింపులపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కూడా ఎమ్మార్ ప్రాపర్టీస్ లావాదేవీలపై సమరం సాగిస్తోంది. కాంగ్రెసు శాసనసభ్యులు డిఎల్ రవీంద్రా రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత ఆ విషయాన్ని తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు అందిపుచ్చుకున్నారు. శుక్రవారం కెసిఆర్ తో ఎమ్మార్ బాధితులు భేటీ అయ్యారు. వారికి కెసిఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎమ్మార్ వ్యవహారాన్ని అతి పెద్ద కుంభకోణంగా బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు లేకండా చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ డిమాండ్ చేశారు.
Read More on Thatstelugu.oneindia.in
Saturday, August 14, 2010
Pressure on ys jagan MOhan Reddy from outside and Inner
Labels: A.P News, Telugu
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment